Monday, May 31, 2010

చాలా రోజులు అయ్యింది మీ అందరిని కలిసి. లైఫ్ ఏంటి రొటీన్ గా వెళ్లి పోతుంది ట్విస్ట్ ఏమి లేదు  అని ఫీల్ అవుతుంటే leasing ఆఫీసు పోరి రెంట్ పెంచి షాక్ ఇచ్చింది. నా hubby గారు ఇల్లు మార్చుదాం అంత రెంట్ వేస్ట్ అన్నాడు. మొన్న మొన్న నే ఈ ఇల్లు గురించి పాటలు పాడేసా." మేడ అంటే మేడ కాదు గూడంటే గూడు కాదు ......"అని. అంటే కూడా వినలేదు. ఇల్లు వెతికి ,ఇల్లు మార్చి ఇప్పటికి అయ్యింది. ఇక్కడ దొరలం మనమే ,కూలి మనమే. cleaning lu etc అయ్యేటప్పటికి 'ఇప్పుడు' అయ్యింది.
    త్వరలో ఏదో ఒక వంట పెట్టేసి బ్లాగ్ చూస్తున్న మీ అందరి ఋణం తీర్చుకుందాం అని అనేఅసుకుంటున్న.
వీకెండ్ పార్టీ తో పొద్దున్నే తలనొప్పులు. అమేరికా లో మా అమ్మాయి వాళ్ళు తెగ పార్టీ లు చేస్కుని ఎంజాయ్ చేస్తారు అనుకునే నాన్న,ఎవరు అయిన  ఇంటికి వస్తే రెండో రోజు నుంచి  పొద్దున్న టిఫిన్ ఏడ్చుకుంటూ రెడీ చేసి,మధ్యానం లంచ్ కి వండి పడేసి రాత్రి నుంచి curry point లు చుట్టూ తిరిగే నా కూతురు ఇలా తెగ వండేస్తుంది అని అందరికి చెప్పుకునే అమ్మ గుర్తు వస్తే ఇంకా తల నొప్పి. డేట్ మారి 3 ,4 గంటలు అయినా తెగ పార్టీలు ఎంజాయ్ చేసి ,ఏమి చేస్తాం ఇక్కడ ఫ్రెండ్స్ అయినా చుట్టాలు అయినా వాళ్ళే కదా . నిద్ర కళ్ళ ని బలవంతం గా తెరుచుకుని పిల్లల్ని ఎత్తుకుని ,తూలే మొగుళ్ళ కన్నా ఎక్కువ మనం తూలీ మధ్య లో kaapu గాడు కనపడ్తాదేమో అని భయం భయం గా ఇంటికి వచాక మళ్లీ అదొక ప్రహసనం . వదిలి వెళ్ళిన sink లో గిన్నెలు 'రా రమ్మని రా రా రమ్మని ' పిలుస్తుంటే 'పిలవకు రా ' అనుకుంటే mancham మీద వాలి తెగ ఎంజాయ్ చేసాం weekend అని ఆనందం.
 ఇది ఈ వీకెండ్ ప్రహసనం.
 ప్రపంచం తో relation తెగి పోయింది కదా వేటూరి వారు చని పోయారు అని తెలీలేదు. చిన్నప్పుడు radio lo "రచన వేటూరి సుందర రామమూర్తి "అని కొప్పుల సుబ్బారావు అని ఆయినా చదివితే విని అబ్బ ఎంత బాగా రాస్తారు ఈయన ఎవరో గాని అని అనుకునే దాన్ని. ప్రతి పాట కి కలాన్ని తేనలో లో ముంచి గుండెలో అమృతం నింపు కుంటూ రాస్తారు గాబోలు యింత తియ్యగా ఉంటది అనిపించేది.  "గోదారమ్మ కుంకం బొట్టు దిద్దే మిరప ఎరుపు","గోదారి లో నీలాంబరి మా సీమ కే చీనాంబరి"హాట్స్ఆఫ్.
మనకి ఉన్నవి 56  తెలుగు అక్షరాలూ కాదు వజ్రాల గనులు. ఎంత అడిగిన అమృతం లాంటి పాటల క్షీరాన్ని ఇచ్హే కామధేనువు లాంటి కవులు . మా తెలుగు తల్లి కి మల్లె పూదండ.
ఇప్పటి కిక ఇంతే.
 ఎప్పుడు పని చెయ్యదు మా కోడలు అని విసుక్కునే  అత్త గారు ఇక్కడ లేకపోయినా   మిగిలి పోయిన గిన్నెలు,విజిల్ వేసే కుక్కరు ఇంకా ఎంత సేపు రా అంటూ పిలుస్తున్నాయి.
ఇక్కడ నుంచి ఎప్పుడు టచ్ లోనే ఉంటా అని ప్రామిస్ చెయ్యలేను. బట్ ఉంటాను.