Sunday, July 18, 2010

Friday, July 16, 2010

Indian yellow Cucumber chutney


చూస్తుంటే నోరు వూరుతున్నట్టు అన్పించే ఈ పచ్చడి మన దోసకాయ పచ్చడి. చాలా మంది కి దోసకాయ వాసన ఇష్టం ఉండదు,అందులో నేను ఒక దాన్ని.కాని ఈ పచ్చడి లో అలాంటి వాసన ఏది రాదు అని నాది హామీ.
ఈ పచ్చడి కి కావలసిన పదార్థాలు:--    ఒక మీడియం సైజు ఎల్లో  దోసకాయ
                       tomatos -2
                                                         పచ్చిమిరప కాయలు -5 లేక ఆరు.
                                     మనం తినే కారం ని బట్టి,పచ్చిమిరపకాయ లో ఉండే   కారం బట్టి
                                   ఆయిల్- 6 స్పూన్స్ 
 .                                 చింత పండు కొంచెం
                                 సాల్ట్- 1-2 spoons
ఇంకా మిగిలినవి పోపు కోసం:--   పచ్చి శనగ పప్పు 2 స్పూన్స్
                                     ఆవాలు -హాఫ్ స్పూన్
                                   మెంతులు -చిటికెడు
                              ఇంగువ-చిటికెడు
                          ఎండుమిర్చి-2
                                జీల కర్ర -1 స్పూన్
                                  వెల్లుల్లి  రెబ్బలు - 2
                               కర్వేపాకు కొంచెం
                                       కొత్తిమీర గార్నిష్ కోసం 

ఫస్ట్ దోసకాయ ని చెక్కు తీసి చిన్న ముక్కలు గా కట్ చేస్కోవాలి.లోపల గింజలు పడెయ్యాలి. ఆ కట్ చేసిన ముక్కల్లో ఒక 5 ముక్కలని పక్కన పెట్టుకోవాలి.వాటిని ఏమి చెయ్యాలో తర్వాత చెప్తా. :) స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక అందులో  మిగిలిన ముక్కలని వెయ్యాలి. సిమ్ లో పెట్టి పైన మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత,టొమాటోలు,పచ్చిమిరప కాయలు కూడా ముక్కలు చేసి అందులో వెయ్యాలి.మధ్య మధ్యలో కలుపుతూ వాటిని కూడా బాగా మగ్గనివ్వాలి. గరిట తో నొక్కి చూస్తే దోసకాయ మెత్తపడిందో లేదో తెలుస్తుంది.మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి ముక్కల మీదనే చింతపండు వేసి ఉంచాలి. ఆ వేడికి చింతపండు మెత్తపడుతుంది. అది ఆరినాక మిక్సి జార్ లో ముక్కలు,చింతపండు మిశ్రమం వేసి ,ఒక వెల్లుల్లి రెబ్బ ,కొంచెం జీల కర్ర,సాల్ట్  వేసి గ్రైండ్ చెయ్యాలి .అవి మొత్తం బాగా గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలో తీస్కుని మనం ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్న 5 దోసకాయ ముక్కల ని చిన్న చిన్న ముక్కలు చేసి ఈ పచ్చడి లో కలపాలి.నా లాగ బద్ధకం ఎక్కువ అయితే మిక్సీ లో మొత్తం పచ్చడి గ్రైండ్ అయ్యాక ఈ మిగిలిన 5 ముక్కలు వేసి 2 seconds తిప్పాలి.  నీళ్ళు  అసలు కలపకూడదు .తర్వాత పోపు చేసే గిన్నెలో ఆయిల్ వేసి అది కాగాక,ఫస్ట్ శనగ పప్పు,వెల్లుల్లి,జీర,ఆవాలు,మెంతులు  వేసి అవి వేగాక ఎండు మిర్చి కర్వేపాకు ,ఇంగువ కలిపి మంచి వాసన వచ్చాక దించి పచ్చడి  మిశ్రమం లో కలపాలి. కొత్తిమీర తో decorate చేస్కోవాలి . దీన్ని అన్నం తో తింటే పుల్లగా,కారం గా చాలా బావుంటుంది. ఇష్టమైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా ఆడ్ చేస్కోవచ్చు. 
దోసకాయ కట్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం taste చూడండి .చేదు గా ఉంటే షాప్ వాడిని తిట్టుకుని పడెయ్యండి.దానితో ట్రై చేసి నన్ను మాత్రం తిట్టుకోవద్దు :)
Monday, July 12, 2010

My favorite recipe vankaya - kaaram


మొత్తానికి మళ్లీ వంటలు షేర్ చేస్తున్న మీతో .ఇన్నాళ్ళు ఫొటోస్ తో షేర్ చేద్దామని చిన్న స్వార్ధం తో ఆగిపోయా. 
ఫోటో లో కలర్ఫుల్ గా కన్పిస్తుంది నాకిష్టంఐన  వంకాయ కూర.
ముఖ్యం గా కావలసినవి :- పొడుగు వంకాయలు (నీటి వంకాయలు)-4
ఆయిల్-100g
సాల్ట్ -2 స్పూన్స్ 
కారం-2 స్పూన్స్
జీరా - 2 స్పూన్స్ 
గార్లిక్ -3 cloves 
కొబ్బరి కోరు -100g 
garam masala - 1 spoon 
మీకు కొంచెం spicy గా కావాలి అంటే కొంచెం ధనియాల పౌడర్ వేస్కోవచ్చు .
ఇంక రెడీ చేద్దామా మన వంకాయ రాజా గారిని. రాజ గారు ఎందుకు అంటే దేవుడే నెత్తి  మీద కిరీటం పెట్టి పంపిచాడు కదా మన వంకాయ గారిని.
ఫస్ట్ పాన్ లో ఒక 10 spoons ఆయిల్  వేసి అది కాగుతుండగా,మన వంకాయల మధ్యలో పొడుగ్గా చిన్న గాటు పెట్టాలి,stuffing కి వీలు ఉండేటట్లు. అలా గాటు పెట్టక పొతే వంకాయలు నూనెలో fry  అవుతున్నప్పుడు పేలే chances ఉంటాయి.ఒకవేళ వంకాయలు మరి పొడుగ్గా ఉంటే సగం కట్ చేస్కోవచ్చు నా లాగ. ఇప్పుడు కాగిన పాన్ లోకి వంకాయలు నెమ్మది గా వేసి కొంచెం సిమ్ లో పెట్టి పైన మూత పెట్టాలి.అవి నెమ్మది గా మగ్గుతాయి,ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం నెమ్మదిగా దాన్ని ఇంకో వైపుకు turn చెయ్యాలి.10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వంకాయలని ప్లేట్ లో పెట్టి కొంచెం ఆరనివ్వాలి.అవి ఆరేలోగా మిక్సి జార్ తీస్కుని అందులో ఉప్పు,కారం,గార్లిక్,గరం మసాల ,జీర,కొబ్బరి కోరు అన్ని add చేసి grind చెయ్యాలి. ఆ పౌడర్ ని ఒక పెద్ద పార్ట్ ,ఒక చిన్న పార్ట్ గా డివైడ్ చెయ్యాలి.పెద్ద పార్ట్ పౌడర్ లో కొంచెం ఆయిల్ కలిపి వంకాయల్లో stuff చెయ్యాలి. తర్వాత పాన్ లో మిగిలిన ఆయిల్ కొంచెం తీసేసి జస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ లో stuff చేసిన వంకాయలు వేసి మూతపెట్టి 5 నిముషాలు  సిమ్ లో ఉంచాలి. తర్వాత వంకాయలని నెమ్మది గా తిప్పుతూ ఇంకో వైపు కూడా fry అవ్వనివ్వాలి.తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వంకాయల మీద మిగిలిన చిన్న పార్ట్ పౌడర్ ని జల్లాలి .కొత్తిమీర  తో decorate చేస్కోవాలి . ఇది అన్నం తో తింటే ఆ taste స్వర్గానికి కొంచమే దూరం లో ఉన్నట్టు అన్పిస్తుంది.
నా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు recipes పెట్టమని.సో మంచి recipe పెట్టాను అని అనుకుంటున్నా.

ఈ recipe సరిగా  రాకపోతే అది నా తప్పు కాక మీదే అని గ్రహించ ప్రార్థన. :)