Wednesday, June 30, 2010

Mana Aavakaya rojulu


ఒక  NRI కధ 

Hi,
మొత్తానికి మనకి ఎండలు వచ్చేసాయి . ఇన్ని రోజులు సాలెపురుగు వలలో చిక్కుకున్న పురుగుల్లాగా,ఇంట్లోనే కూర్చుని వెబ్ లో  laptop through   చిక్కుకున్న మనం అప్పుడప్పుడు బయట తిరగొచ్చు.(వెబ్ అంటేనే సాలెగూడు కదా!) .Summer అంటే నాకు మామిడి కాయలు తెగ గుర్తు వస్తున్నాయి. India లో ఉన్నప్పుడు అనిపిచ్చేది మామిడి కాయలు లేకపోతె summer ఇంకా ఎంత హాట్ గా ఉంటుందో అని. మనం ఎంత Americanise  అయిపోయి ఇక్కడ ఫుడ్స్ ని మనలో కలిపేస్కున్నా, మన ఆవకాయలు, వడియాలు Import అవకుండా మన suitcase లు ఉండవు  .అదేదో మూవీ లో డైలాగ్ లాగా మన అమ్మమ్మ ,మన అమ్మ ,మన ఆవకాయ ఎన్ని  generations అయినా  ఎప్పుడు బోర్ కొట్టవు.  
      ఇండియా లో మన అమ్మలు ఫోన్ లో ఆవకాయ కి మామిడి కాయలు కొనటానికి వెళ్తున్నాం అనగానే ఆ taste మన taste buds మీద చేసే డాన్సు గుర్తు వస్తుంది మనకి.ఎప్పుడు ఏ పుణ్యాత్ములు ఇండియా నుంచి వస్తూ ఆవకాయ తెస్తారో అని వెయిటింగ్ అప్పట్నించి. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం  అమ్మమ్మ పట్టే ఆవకాయ గుర్తు వస్తే అప్పుడే ఎందుకు పెద్ద య్యమా అన్పిస్తుంది. మామిడి కాయలు తెచ్చి ముక్కలు కొట్టటం తాతగార్ల డ్యూటీ. ముక్కలు తుడవటం ,జీడి పీకటం పిల్లల పని. తర్వాత బేసిన్ లో ఆవ పిండి , కారం ,ఉప్పు etc.. వేసి mix చేసి జాడీ లో పెట్టటం అమ్మమ్మ డ్యూటీ. అన్నిటి కన్నాపిల్లలం వెయిట్ చేసేది ఒకటి ఉండేది, ఆ పచ్చడి కలిపిన బేసిన్ లో అన్నం కలిపి ,నెయ్యి వేసి ముద్దలు పెట్టేది అమ్మమ్మ. ఆ taste కి ఏ burgers ,noodles ఎప్పటికీ సాటి రావు..
ఎందుకో ఈ ప్రాసెస్ మొత్తం సీక్రెట్ గా జరిగేది పని వాళ్ళకు తెలీకుండా. ఇప్పుడు ఇదంతా గుర్తు వస్తే కళ్ళు మూస్కుని ఫ్లాష్ బ్యాక్ రింగ్స్ తిప్పటమే, అమ్మమ్మ వొళ్ళో తల పెట్టుకుని తను నా తల నిమురుతున్నట్టు ఊహించుకోవటమే .
అందరిని అమ్మమ్మ దగ్గరికి,ఆవకాయ దగ్గరికి  పంపించేసి నట్టు ఉన్నాకదా...
THANK YOU. ENJOY SUMMER.

Tuesday, June 15, 2010

hi

 చాలా రోజులు అయ్యింది మీతో కబుర్లు చెప్పి. summer holidays తో పిల్లలు relax అయ్యారు. నేను బిజీ అయ్యాను. so అదే లేట్.
ఈ మధ్య ఎన్నో వంటలు చేసేస్తున్నా మీతో recipes  షేర్ చేస్కోకుండానే . అన్ని ఒక్క సారి చెప్పేస్తా . మీరు  ట్రై చేద్దురు గాని. ఎన్ని వంటలు చేసినా, ఎన్ని restaurants ట్రై చేసినా అమ్మ వంటల రుచి ఇంకా ఇంకా గుర్తు వస్తూనే ఉంది.
    టీవీ చూస్తున్న ప్రతీ సారి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు వస్తూ  ఉంటుంది. ఇప్పటి పిల్లల లాగ వాచ్ చెయ్యటానికి ఇన్ని చానల్స్ లేవు. ఉండే ఒకే ఒక్క doordarshan కోసం కష్టాలు. ప్రతీ ఇంటి పైన గాలి గోపురం లాగ పెద్ద antenna గొట్టాలు. వాటిని దూరదర్శన్ స్టేషన్ direction  వైపు తిప్పుతుండే నాన్నలు. టీవీ ముందు కూర్చుని క్లారిటీ ఉందో లేదో చూసే అమ్మలు , టీవీ నుంచి ఇంటి పైన దాక సిగ్నల్ సరిగా ఉందో లేదో వార్తలు చేర వేసే తమ్ముళ్ళు,అక్కలు,అన్నలు,చెల్లెళ్ళు . అంగుళం లో ఆరో వంతు ఆ antenna direction తిప్పి సిగ్నల్ వస్తుందా ? అని నాన్న అడిగితే వస్తుందా ?వస్తుందా?? అని న్యూస్ పాస్ చేస్కుంటూ టీవీ చూసి ఆ వస్తుంది అని ఆనంద పడటం . గుర్తుకు వస్తే ఆ ఫీల్ express చెయ్యటం కూడా కష్టం.  ఈవినింగ్   ఒక గంట మాత్రం వచ్చే  ప్రాయోజిత కార్యక్రమాలు,ఫ్రైడే వచ్చే చిత్రలహరి , సండే గంట సేపు వచ్చే రామాయణ్,మహాభారత్ లు అప్పట్లో ఫ్యామిలీ hours, neighbours get together లు.ఇది కాక అప్పట్లో వచ్చే ads ప్రతీ పిల్లల నోట్లో కంట్టస్తం. అబ్బ ఇన్ని విషయాలు చెప్పి అసలు విషయం మర్చిపోయా... అది పవర్ కట్ . ఏ రామాయణం మధ్య లోనో కరెంటు పొతే ఆ కరెంటు తీసే వాడిని తిట్టే తిట్లు వాడి ఏడు తరాలని కలిపి మరి ఉండేవి. సీతా దేవి కష్టాలని  చూసి ఏడవని వాళ్ళు, రావణుడిని శాపాలు పెట్టని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు.. 
at the same time ,మహాభారతం లో కృష్ణుడి కి అండ్ అర్జునిడికి ఫుల్ పిల్లల్లో, పెద్దల్లో fan  following .
మనం చాలా లక్కీ, ఇలాంటి thrills మన మెమోరీస్ లో చాలా  ఉన్నాయి. మన పిల్లలు చాలా లక్కీ, ఇలాంటి బాధలు లేకుండా బోల్డన్ని చానల్స్,remote తో on  అయ్యే టీవీ లు. 
ఇంకా ఏమి చెప్పాలి ?? మళ్లీ ఒక మంచి మెమరీ or మంచి వంట తో మిమ్మల్ని కలుసుకుంటా..bye.Thank you. 

Wednesday, June 2, 2010

hi

hi  
ఏంటి టచ్ లో ఉంటా అని చెప్పి మాట నిలబెట్టుకోలేదు అనుకుంటున్నారా?? ఏమి చెయ్యను?

 అసలే పిల్లలు గలదాన్ని.
 ఏంటి బ్లాగ్ కి పిల్లలకి ఏమి సంబంధం అనుకోవచ్చు . ఆ రైట్ మీకు ఉంది.
" పిల్లలు, టపాకాయలు దూరం నుంచి చూస్తె నే అందం గా ఉంటాయి. బట్ టచ్ చేస్తే మనకి కాల్తుంది".
 పక్కింటి వాళ్ళ పిల్లల్ని చూసి అబ్బ పిల్లలు ఉంటె ఎంత హ్యాపీ గా ఉంటది జీవితం,పిల్లలు లేని ఇల్లు ఒక ఇల్లేనా అని తెగ ఫీల్ అయ్యి ,ఓనిడా ad లాగా owners pride neighbours envy అని అనుకుంటాం. బట్ తర్వాత తెలుస్తుంది అది రివర్స్ అవుతుంది అని.  పిల్లలతో ఫ్యామిలీ complete అయ్యింది అనే ఆనందం ని డామినేట్ చేస్తూ కష్టాలు,త్యాగాలు. త్యాగానికి Gender తేడా కూడా లేదు . భార్య ,భర్త వంతులవారిగా చెయ్యాలి. ఇష్టమైన మూవీ చూస్తుంటే మధ్యలో చంటాడి ఏడుపు. చంటి దానికి ఆకలి. ఈలోగా విసుగు తో భర్త గారి చిరాకులు.అయినా భరించి సినిమా చూస్తుంటే చుట్టూ పక్కల సీట్స్ లో వాళ్ళ అరుపులు పిల్లల్ని బయటికి తీస్కెల్లమ్మ అని .  ఇవన్ని భరించి పెద్ద అయితే కష్టాలు తీరతాయి అనుకుని దుఖాసృవులని ఆనంద భాష్పాలగా మార్చుకుని ఓపిక తో వెయిట్ చేస్తే  పెద్ద అయ్యాక  ఏ rated movie లో ఏమి వర్డ్స్ వినేస్తాడో,laptop లో ఏమి సైట్స్ ఓపెన్ చేస్తాడో అని టెన్షన్. సో ఇన్ని' పీత' కష్టాల మధ్యలో కొంచెం లేట్ అయ్యింది. ఇవ్వాళ definate గా ఏదో ఒక వంట చేసి పెడతా.

మీరందరూ బ్లాగ్ visit  చేసి ఇస్తున్న ఇన్స్పిరేషన్ కి thank you.