Amma Cheti Vantalu
HI I want to share all authentic Indian recipes with you.You can do it toooo...
Wednesday, August 18, 2010
Sunday, July 18, 2010
Friday, July 16, 2010
Indian yellow Cucumber chutney
చూస్తుంటే నోరు వూరుతున్నట్టు అన్పించే ఈ పచ్చడి మన దోసకాయ పచ్చడి. చాలా మంది కి దోసకాయ వాసన ఇష్టం ఉండదు,అందులో నేను ఒక దాన్ని.కాని ఈ పచ్చడి లో అలాంటి వాసన ఏది రాదు అని నాది హామీ.
ఈ పచ్చడి కి కావలసిన పదార్థాలు:-- ఒక మీడియం సైజు ఎల్లో దోసకాయ
tomatos -2
పచ్చిమిరప కాయలు -5 లేక ఆరు.
మనం తినే కారం ని బట్టి,పచ్చిమిరపకాయ లో ఉండే కారం బట్టి
ఆయిల్- 6 స్పూన్స్
. చింత పండు కొంచెం
సాల్ట్- 1-2 spoons
ఇంకా మిగిలినవి పోపు కోసం:-- పచ్చి శనగ పప్పు 2 స్పూన్స్
ఆవాలు -హాఫ్ స్పూన్
మెంతులు -చిటికెడు
ఇంగువ-చిటికెడు
ఎండుమిర్చి-2
జీల కర్ర -1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2
కర్వేపాకు కొంచెం
కొత్తిమీర గార్నిష్ కోసం
ఫస్ట్ దోసకాయ ని చెక్కు తీసి చిన్న ముక్కలు గా కట్ చేస్కోవాలి.లోపల గింజలు పడెయ్యాలి. ఆ కట్ చేసిన ముక్కల్లో ఒక 5 ముక్కలని పక్కన పెట్టుకోవాలి.వాటిని ఏమి చెయ్యాలో తర్వాత చెప్తా. :) స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక అందులో మిగిలిన ముక్కలని వెయ్యాలి. సిమ్ లో పెట్టి పైన మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత,టొమాటోలు,పచ్చిమిరప కాయలు కూడా ముక్కలు చేసి అందులో వెయ్యాలి.మధ్య మధ్యలో కలుపుతూ వాటిని కూడా బాగా మగ్గనివ్వాలి. గరిట తో నొక్కి చూస్తే దోసకాయ మెత్తపడిందో లేదో తెలుస్తుంది.మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి ముక్కల మీదనే చింతపండు వేసి ఉంచాలి. ఆ వేడికి చింతపండు మెత్తపడుతుంది. అది ఆరినాక మిక్సి జార్ లో ముక్కలు,చింతపండు మిశ్రమం వేసి ,ఒక వెల్లుల్లి రెబ్బ ,కొంచెం జీల కర్ర,సాల్ట్ వేసి గ్రైండ్ చెయ్యాలి .అవి మొత్తం బాగా గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలో తీస్కుని మనం ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్న 5 దోసకాయ ముక్కల ని చిన్న చిన్న ముక్కలు చేసి ఈ పచ్చడి లో కలపాలి.నా లాగ బద్ధకం ఎక్కువ అయితే మిక్సీ లో మొత్తం పచ్చడి గ్రైండ్ అయ్యాక ఈ మిగిలిన 5 ముక్కలు వేసి 2 seconds తిప్పాలి. నీళ్ళు అసలు కలపకూడదు .తర్వాత పోపు చేసే గిన్నెలో ఆయిల్ వేసి అది కాగాక,ఫస్ట్ శనగ పప్పు,వెల్లుల్లి,జీర,ఆవాలు,మెంతులు వేసి అవి వేగాక ఎండు మిర్చి కర్వేపాకు ,ఇంగువ కలిపి మంచి వాసన వచ్చాక దించి పచ్చడి మిశ్రమం లో కలపాలి. కొత్తిమీర తో decorate చేస్కోవాలి . దీన్ని అన్నం తో తింటే పుల్లగా,కారం గా చాలా బావుంటుంది. ఇష్టమైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా ఆడ్ చేస్కోవచ్చు.
దోసకాయ కట్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం taste చూడండి .చేదు గా ఉంటే షాప్ వాడిని తిట్టుకుని పడెయ్యండి.దానితో ట్రై చేసి నన్ను మాత్రం తిట్టుకోవద్దు :)
Monday, July 12, 2010
My favorite recipe vankaya - kaaram
మొత్తానికి మళ్లీ వంటలు షేర్ చేస్తున్న మీతో .ఇన్నాళ్ళు ఫొటోస్ తో షేర్ చేద్దామని చిన్న స్వార్ధం తో ఆగిపోయా.
ఫోటో లో కలర్ఫుల్ గా కన్పిస్తుంది నాకిష్టంఐన వంకాయ కూర.
ముఖ్యం గా కావలసినవి :- పొడుగు వంకాయలు (నీటి వంకాయలు)-4
ఆయిల్-100g
సాల్ట్ -2 స్పూన్స్
కారం-2 స్పూన్స్
జీరా - 2 స్పూన్స్
గార్లిక్ -3 cloves
కొబ్బరి కోరు -100g
garam masala - 1 spoon
మీకు కొంచెం spicy గా కావాలి అంటే కొంచెం ధనియాల పౌడర్ వేస్కోవచ్చు .
ఇంక రెడీ చేద్దామా మన వంకాయ రాజా గారిని. రాజ గారు ఎందుకు అంటే దేవుడే నెత్తి మీద కిరీటం పెట్టి పంపిచాడు కదా మన వంకాయ గారిని.
ఫస్ట్ పాన్ లో ఒక 10 spoons ఆయిల్ వేసి అది కాగుతుండగా,మన వంకాయల మధ్యలో పొడుగ్గా చిన్న గాటు పెట్టాలి,stuffing కి వీలు ఉండేటట్లు. అలా గాటు పెట్టక పొతే వంకాయలు నూనెలో fry అవుతున్నప్పుడు పేలే chances ఉంటాయి.ఒకవేళ వంకాయలు మరి పొడుగ్గా ఉంటే సగం కట్ చేస్కోవచ్చు నా లాగ. ఇప్పుడు కాగిన పాన్ లోకి వంకాయలు నెమ్మది గా వేసి కొంచెం సిమ్ లో పెట్టి పైన మూత పెట్టాలి.అవి నెమ్మది గా మగ్గుతాయి,ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం నెమ్మదిగా దాన్ని ఇంకో వైపుకు turn చెయ్యాలి.10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వంకాయలని ప్లేట్ లో పెట్టి కొంచెం ఆరనివ్వాలి.అవి ఆరేలోగా మిక్సి జార్ తీస్కుని అందులో ఉప్పు,కారం,గార్లిక్,గరం మసాల ,జీర,కొబ్బరి కోరు అన్ని add చేసి grind చెయ్యాలి. ఆ పౌడర్ ని ఒక పెద్ద పార్ట్ ,ఒక చిన్న పార్ట్ గా డివైడ్ చెయ్యాలి.పెద్ద పార్ట్ పౌడర్ లో కొంచెం ఆయిల్ కలిపి వంకాయల్లో stuff చెయ్యాలి. తర్వాత పాన్ లో మిగిలిన ఆయిల్ కొంచెం తీసేసి జస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ లో stuff చేసిన వంకాయలు వేసి మూతపెట్టి 5 నిముషాలు సిమ్ లో ఉంచాలి. తర్వాత వంకాయలని నెమ్మది గా తిప్పుతూ ఇంకో వైపు కూడా fry అవ్వనివ్వాలి.తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వంకాయల మీద మిగిలిన చిన్న పార్ట్ పౌడర్ ని జల్లాలి .కొత్తిమీర తో decorate చేస్కోవాలి . ఇది అన్నం తో తింటే ఆ taste స్వర్గానికి కొంచమే దూరం లో ఉన్నట్టు అన్పిస్తుంది.
నా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు recipes పెట్టమని.సో మంచి recipe పెట్టాను అని అనుకుంటున్నా.
ఈ recipe సరిగా రాకపోతే అది నా తప్పు కాక మీదే అని గ్రహించ ప్రార్థన. :)
Wednesday, June 30, 2010
Mana Aavakaya rojulu
ఒక NRI కధ
Hi,
మొత్తానికి మనకి ఎండలు వచ్చేసాయి . ఇన్ని రోజులు సాలెపురుగు వలలో చిక్కుకున్న పురుగుల్లాగా,ఇంట్లోనే కూర్చుని వెబ్ లో laptop through చిక్కుకున్న మనం అప్పుడప్పుడు బయట తిరగొచ్చు.(వెబ్ అంటేనే సాలెగూడు కదా!) .Summer అంటే నాకు మామిడి కాయలు తెగ గుర్తు వస్తున్నాయి. India లో ఉన్నప్పుడు అనిపిచ్చేది మామిడి కాయలు లేకపోతె summer ఇంకా ఎంత హాట్ గా ఉంటుందో అని. మనం ఎంత Americanise అయిపోయి ఇక్కడ ఫుడ్స్ ని మనలో కలిపేస్కున్నా, మన ఆవకాయలు, వడియాలు Import అవకుండా మన suitcase లు ఉండవు .అదేదో మూవీ లో డైలాగ్ లాగా మన అమ్మమ్మ ,మన అమ్మ ,మన ఆవకాయ ఎన్ని generations అయినా ఎప్పుడు బోర్ కొట్టవు.
ఇండియా లో మన అమ్మలు ఫోన్ లో ఆవకాయ కి మామిడి కాయలు కొనటానికి వెళ్తున్నాం అనగానే ఆ taste మన taste buds మీద చేసే డాన్సు గుర్తు వస్తుంది మనకి.ఎప్పుడు ఏ పుణ్యాత్ములు ఇండియా నుంచి వస్తూ ఆవకాయ తెస్తారో అని వెయిటింగ్ అప్పట్నించి. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మమ్మ పట్టే ఆవకాయ గుర్తు వస్తే అప్పుడే ఎందుకు పెద్ద య్యమా అన్పిస్తుంది. మామిడి కాయలు తెచ్చి ముక్కలు కొట్టటం తాతగార్ల డ్యూటీ. ముక్కలు తుడవటం ,జీడి పీకటం పిల్లల పని. తర్వాత బేసిన్ లో ఆవ పిండి , కారం ,ఉప్పు etc.. వేసి mix చేసి జాడీ లో పెట్టటం అమ్మమ్మ డ్యూటీ. అన్నిటి కన్నాపిల్లలం వెయిట్ చేసేది ఒకటి ఉండేది, ఆ పచ్చడి కలిపిన బేసిన్ లో అన్నం కలిపి ,నెయ్యి వేసి ముద్దలు పెట్టేది అమ్మమ్మ. ఆ taste కి ఏ burgers ,noodles ఎప్పటికీ సాటి రావు..
ఎందుకో ఈ ప్రాసెస్ మొత్తం సీక్రెట్ గా జరిగేది పని వాళ్ళకు తెలీకుండా. ఇప్పుడు ఇదంతా గుర్తు వస్తే కళ్ళు మూస్కుని ఫ్లాష్ బ్యాక్ రింగ్స్ తిప్పటమే, అమ్మమ్మ వొళ్ళో తల పెట్టుకుని తను నా తల నిమురుతున్నట్టు ఊహించుకోవటమే .
అందరిని అమ్మమ్మ దగ్గరికి,ఆవకాయ దగ్గరికి పంపించేసి నట్టు ఉన్నాకదా...
THANK YOU. ENJOY SUMMER.
Tuesday, June 15, 2010
hi
చాలా రోజులు అయ్యింది మీతో కబుర్లు చెప్పి. summer holidays తో పిల్లలు relax అయ్యారు. నేను బిజీ అయ్యాను. so అదే లేట్.
ఈ మధ్య ఎన్నో వంటలు చేసేస్తున్నా మీతో recipes షేర్ చేస్కోకుండానే . అన్ని ఒక్క సారి చెప్పేస్తా . మీరు ట్రై చేద్దురు గాని. ఎన్ని వంటలు చేసినా, ఎన్ని restaurants ట్రై చేసినా అమ్మ వంటల రుచి ఇంకా ఇంకా గుర్తు వస్తూనే ఉంది.
టీవీ చూస్తున్న ప్రతీ సారి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు వస్తూ ఉంటుంది. ఇప్పటి పిల్లల లాగ వాచ్ చెయ్యటానికి ఇన్ని చానల్స్ లేవు. ఉండే ఒకే ఒక్క doordarshan కోసం కష్టాలు. ప్రతీ ఇంటి పైన గాలి గోపురం లాగ పెద్ద antenna గొట్టాలు. వాటిని దూరదర్శన్ స్టేషన్ direction వైపు తిప్పుతుండే నాన్నలు. టీవీ ముందు కూర్చుని క్లారిటీ ఉందో లేదో చూసే అమ్మలు , టీవీ నుంచి ఇంటి పైన దాక సిగ్నల్ సరిగా ఉందో లేదో వార్తలు చేర వేసే తమ్ముళ్ళు,అక్కలు,అన్నలు,చెల్లెళ్ళు . అంగుళం లో ఆరో వంతు ఆ antenna direction తిప్పి సిగ్నల్ వస్తుందా ? అని నాన్న అడిగితే వస్తుందా ?వస్తుందా?? అని న్యూస్ పాస్ చేస్కుంటూ టీవీ చూసి ఆ వస్తుంది అని ఆనంద పడటం . గుర్తుకు వస్తే ఆ ఫీల్ express చెయ్యటం కూడా కష్టం. ఈవినింగ్ ఒక గంట మాత్రం వచ్చే ప్రాయోజిత కార్యక్రమాలు,ఫ్రైడే వచ్చే చిత్రలహరి , సండే గంట సేపు వచ్చే రామాయణ్,మహాభారత్ లు అప్పట్లో ఫ్యామిలీ hours, neighbours get together లు.ఇది కాక అప్పట్లో వచ్చే ads ప్రతీ పిల్లల నోట్లో కంట్టస్తం. అబ్బ ఇన్ని విషయాలు చెప్పి అసలు విషయం మర్చిపోయా... అది పవర్ కట్ . ఏ రామాయణం మధ్య లోనో కరెంటు పొతే ఆ కరెంటు తీసే వాడిని తిట్టే తిట్లు వాడి ఏడు తరాలని కలిపి మరి ఉండేవి. సీతా దేవి కష్టాలని చూసి ఏడవని వాళ్ళు, రావణుడిని శాపాలు పెట్టని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు..
at the same time ,మహాభారతం లో కృష్ణుడి కి అండ్ అర్జునిడికి ఫుల్ పిల్లల్లో, పెద్దల్లో fan following .
మనం చాలా లక్కీ, ఇలాంటి thrills మన మెమోరీస్ లో చాలా ఉన్నాయి. మన పిల్లలు చాలా లక్కీ, ఇలాంటి బాధలు లేకుండా బోల్డన్ని చానల్స్,remote తో on అయ్యే టీవీ లు.
ఇంకా ఏమి చెప్పాలి ?? మళ్లీ ఒక మంచి మెమరీ or మంచి వంట తో మిమ్మల్ని కలుసుకుంటా..bye.Thank you.

Wednesday, June 2, 2010
hi
hi
ఏంటి టచ్ లో ఉంటా అని చెప్పి మాట నిలబెట్టుకోలేదు అనుకుంటున్నారా?? ఏమి చెయ్యను?
అసలే పిల్లలు గలదాన్ని.
ఏంటి బ్లాగ్ కి పిల్లలకి ఏమి సంబంధం అనుకోవచ్చు . ఆ రైట్ మీకు ఉంది.
" పిల్లలు, టపాకాయలు దూరం నుంచి చూస్తె నే అందం గా ఉంటాయి. బట్ టచ్ చేస్తే మనకి కాల్తుంది".
పక్కింటి వాళ్ళ పిల్లల్ని చూసి అబ్బ పిల్లలు ఉంటె ఎంత హ్యాపీ గా ఉంటది జీవితం,పిల్లలు లేని ఇల్లు ఒక ఇల్లేనా అని తెగ ఫీల్ అయ్యి ,ఓనిడా ad లాగా owners pride neighbours envy అని అనుకుంటాం. బట్ తర్వాత తెలుస్తుంది అది రివర్స్ అవుతుంది అని. పిల్లలతో ఫ్యామిలీ complete అయ్యింది అనే ఆనందం ని డామినేట్ చేస్తూ కష్టాలు,త్యాగాలు. త్యాగానికి Gender తేడా కూడా లేదు . భార్య ,భర్త వంతులవారిగా చెయ్యాలి. ఇష్టమైన మూవీ చూస్తుంటే మధ్యలో చంటాడి ఏడుపు. చంటి దానికి ఆకలి. ఈలోగా విసుగు తో భర్త గారి చిరాకులు.అయినా భరించి సినిమా చూస్తుంటే చుట్టూ పక్కల సీట్స్ లో వాళ్ళ అరుపులు పిల్లల్ని బయటికి తీస్కెల్లమ్మ అని . ఇవన్ని భరించి పెద్ద అయితే కష్టాలు తీరతాయి అనుకుని దుఖాసృవులని ఆనంద భాష్పాలగా మార్చుకుని ఓపిక తో వెయిట్ చేస్తే పెద్ద అయ్యాక ఏ rated movie లో ఏమి వర్డ్స్ వినేస్తాడో,laptop లో ఏమి సైట్స్ ఓపెన్ చేస్తాడో అని టెన్షన్. సో ఇన్ని' పీత' కష్టాల మధ్యలో కొంచెం లేట్ అయ్యింది. ఇవ్వాళ definate గా ఏదో ఒక వంట చేసి పెడతా.
మీరందరూ బ్లాగ్ visit చేసి ఇస్తున్న ఇన్స్పిరేషన్ కి thank you.

Subscribe to:
Posts (Atom)